అన్నమయ్య: కేవీపల్లి ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ చెన్నూరి బాలాజీ, ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ ఆశయాలను కొనియాడారు. విద్యార్థులకు ఆటల పోటీలు, చిత్రలేఖన పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కేవీపల్లి ఆదర్శ పాఠశాలలో బాలల దినోత్సవం


