హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ కబ్జాదారుడిపై పీడీ యాక్ట్

HYD: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో భూ కబ్జాదారుడు పంజాల జైహింద్ గౌడ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాంపల్లిలో వివాదాస్పద భూమిలో అక్రమ లేఅవుట్ వేసి, ప్లాట్ల విక్రయం పేరుతో అమాయకులను మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై పలు కేసులు ఉండటంతో సీపీ బి. సుమతి ఆదేశాల మేరకు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.