హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిబాబు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: మంత్రి

E.G: ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు మృతి పట్ల రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో గిరిబాబు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగి 600కు పైగా చిత్రాల్లో నటించడం గొప్ప విషయమన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి తెలిపారు.