హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

భూపాలపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఛైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, సీఐ శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు బట్టు శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.