హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రతుకు పోరాటంలో బాల్యం...!

NLR: ఉదయగిరిలో బాలల దినోత్సవం రోజున చిన్నారుల దయనీయ పరిస్థితి వెలుగు చూసింది. బడికి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో పిల్లలు చిత్తు కాగితాలు ఏరుకుంటూ, కనీసం త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ ప్లాస్టిక్ సీసాలతో ఇటుక బట్టి వద్దకు వెళ్లి నీళ్లు నింపుకుంటున్న దృశ్యాలు అందరిని కలిచివేశాయి. ఈ బాలలకు విద్య అవకాశాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.