నంద్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సునీల్ షొరాణ్ శనివారం సూచించారు. అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని, ర్యాలీలు, గుంపులుగా చేరడం నిషేధమని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి: ఎస్పీ


