హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు అనపర్తి పాఠశాల విద్యార్థులు

E.G: అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం వెంకటరెడ్డి తెలిపారు. బాస్కెట్‌బాల్‌లో పి.చరణ్ (అండర్-17), డి.అనిల్ (అండర్-14), నెట్‌బాల్‌లో డి.యశ్వంత్ (అండర్-19), వాలీబాల్‌లో సిహెచ్. బంగారి, ఎ.జాహ్నవి (అండర్-19) జిల్లా తరఫున ఆడనున్నారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.