కృష్ణా: ఉంగుటూరు మండలం పొట్టిపాడు రైతు సేవా కేంద్రంలో రబీ సీజన్‌లో మినుము, పెసర పంటల సాగుపై రైతులకు ఇవాళ శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఆత్మ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణ, భూసార పరీక్షలు, విత్తన శుద్ధి, జీవ ఎరువుల వినియోగం, అధిక దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం, బహుళ పంటల సాగుతో అధిక లాభాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రబీ పంటల సాగుపై రైతులకు శిక్షణ


