హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో మధుమేహ అవగాహన ర్యాలీ

NLR: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరులో వైద్య ఆరోగ్య శాఖ శనివారం అవగాహన ర్యాలీ, ఉచిత పరీక్షల శిబిరం నిర్వహించింది. DMHO వి.సుజాత ర్యాలీని ప్రారంభించారు. జీవనశైలి మార్పులతో మధుమేహం పెరుగుతోందని, ముందస్తు పరీక్షలతోనే నియంత్రణ సాధ్యమని ఆమె సూచించారు. ఆహారం, వ్యాయామంతో దీన్ని అదుపులో ఉంచవచ్చని తెలిపారు.