హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD వేదికగా అంతర్జాతీయ సదస్సు గర్వకారణం: శ్రీధర్ బాబు

HYD: హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గర్వకారణమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నెహ్రూ 137వ జయంతి వేడుకలో ఆయనకు నివాళులర్పించిన మంత్రి, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నెహ్రూ అలీన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రెండు రోజులు సాగిన సదస్సులో పలు దేశాల నుంచి వెయ్యికి పైగా ప్రతినిధులు పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు.