హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుందరాజుపేటలో ఉచిత పశువైద్య శిబిరం

BHPL: కాటారం మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధి సుందరాజుపేటలో పశుసంవర్ధక, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జి. రమేష్ ఆధ్వర్యంలో ఐదు పశువులకు ప్రత్యేక పరీక్షలు, 70 పశువులకు గర్భకోశ వ్యాధులకు, 15 పశువులకు సాధారణ చికిత్సలు అందించారు. పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.