JN: ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ పిట్టలదొర వేషధారణతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతూ.. పాలకుర్తి జంక్షన్, బస్టాండ్ పరిసరాల్లో శనివారం వినూత్నంగా అవగాహన కల్పించారు.
తెలంగాణ
పిట్టలదొర కాదు ఉపాధ్యాయుడు!


