TPT: గూడూరు పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజున టీడీపీ తరఫున పులిమి శ్రీనివాసులు ముందంజ వేశారు. 12వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేసి అధికారికి పత్రాలు ఇచ్చారు. గతంలో ఇదే వార్డు నుంచి ఎన్నోసార్లు పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుపొందినట్లు శ్రీనివాసులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారి కూడా విజయం తమదేనని ఆయన నమ్మకంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
గూడూరు మున్సిపాలిటీ టిడిపి నామినేషన్


