హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు'

ATP: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు, ఎంపీడీవోలు శనివారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల కట్‌ఆఫ్ పాయింట్లు, బందోబస్తు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటును వారు సమీక్షించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.