హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండాపురం గ్రామంలో తీరిన నీటి సమస్య

ATP: బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామంలో మాజీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి తాగునీటి బోరు వేయించారు. గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండటంతో బోరు ఏర్పాటు చేయించారు. బోరులో సమృద్ధిగా నీరు పడటంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని రామలింగారెడ్డి తెలిపారు.