KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని గౌతమి వెంకటలక్ష్మి రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికైంది. జామ ఆకులతో తయారు చేసిన టీలో విటమిన్-సి, పొటాషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు ఉన్నట్లు ప్రయోగాల ద్వారా వివరించిన ప్రాజెక్ట్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుకుని రాష్ట్రస్థాయికి చేరింది.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు చెందుర్తి విద్యార్థిని


