హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌కు 21 ఫిర్యాదులు

అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి 21 అర్జీలు అందజేశారు. ఇళ్ల పట్టాలు, వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రతి సమస్యను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలియజేశారు.