హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేటలో బస్సు ప్రమాదం

TPT: సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆర్చ్ దగ్గర తమిళనాడు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. కాళంగి వంతెన మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు పెట్టిన ఇనుప రాడ్డును వేగంగా వచ్చిన బస్సు గట్టిగా గుద్దేసింది. పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నా ఇలా జరగడం గమనార్హం. అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న ప్రయాణికులెవరికీ ఏ గాయం కాలేదని తెలిసింది.