హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో లైబ్రరీ వారోత్సవాలు ప్రారంభం

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి ఆదేశాల మేరకు నవంబర్ 14 నుంచి 20 వరకు జరిగే లైబ్రరీ వారోత్సవాలను వైస్ ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు శనివారం ప్రారంభించారు. విద్యార్థినులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. లైబ్రేరియన్ మోహన్ కుమార్ వ్యాసరచన, వక్తృత్వం, పుస్తక ప్రదర్శన, పోటీలు నిర్వహిస్తామన్నారు.