హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మకర తోరణం వితరణ

CTR: చౌడేపల్లి మండలం రాజనాలబండ ప్రసన్న ఆంజనేయస్వామికి భక్తులు విలువైన కానుకలను సమర్పించారు. తిరుపతికి చెందిన విశ్రాంత ఏఎస్ఐ శ్రీరామ్ ఆనంద్ శనివారం రూ. 20 వేల విలువైన మకర తోరణంతో పాటు, రూ. 10 వేల విలువ చేసే రెండు ముక్కుపుడకలను బహూకరించారు. పుంగనూరు టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కానుకలు అందించారు.