హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిర్లక్ష్యం వహిస్తూ కఠిన చర్యలు'

BHNG: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఆస్పత్రి పరిసరాలతో పాటు మార్చురీ కూడా అపరిశుభ్రంగా మారింది. పోస్టుమార్టం అనంతరం స్టెచర్లపై రక్తపు మరకలను శుభ్రం చేయకుండా వదిలేయడంపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు.