హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'

అన్నమయ్య: మదనపల్లె టీడీపీ కార్యాలయంలో రామసముద్రం మండల కూటమి నాయకులతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 2న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.