KRNL: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కర్నూలులో శనివారం అవగాహన ర్యాలీ జరిగింది. గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ.. కరపత్రాలు పంచారు. ఆహార నియమాలు, నడక, వ్యాయామం, క్రమం తప్పని షుగర్ పరీక్షలతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని, గుండె, కిడ్నీ, కంటి సమస్యలను ముందే నివారించవచ్చని వైద్యులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మధుమేహ అవగాహన ర్యాలీ


