హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిట్టువారిపాలెంలో రూ.25 లక్షలకు సర్పంచ్ పదవి

BPT: చీరాల మండలం పిట్టువారిపాలెం పంచాయతీ సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రూ.25 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. పంచాయతీ ఎన్నికల తొలి విడత నేపథ్యంలో పలు గ్రామాల్లో పదవుల కోసం ఇలా వేలం పాటలు కొనసాగుతున్నాయి. కాగా, వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో రూ.2.30 కోట్ల వేలం జరిగిన విషయం తెలిసిందే. ఏకగ్రీవాల పేరుతో సాగే ఈ వేలం పాటలపై జిల్లాలో సర్వత్రా చర్చ సాగుతోంది.