హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న మేయర్ అభ్యర్థి సువర్ణ

KDP: సిద్ధవటం మండలం కనుమలోపల్లె శివారులోని శ్రీ మానసా దేవి ఆలయ వార్షికోత్సవాల్లో కడప మేయర్ అభ్యర్థి సువర్ణ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్వాహకులు లక్ష్మయ్య స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చనలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.