అన్నమయ్య: రాయచోటి మాసాపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి. వినోద్ కుమార్ హాజరై బాలల హక్కులు, చట్టాలు, బాల్యవివాహాల నిషేధం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో బాలల సహాయవాణి 1098, అత్యవసర సేవలు 112 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గురుకుల పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం


