ELR: నూజివీడు పట్టణంలోని డాక్టర్.బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం బాలికలతో మొక్కలు నాటించారు. ప్రిన్సిపల్ ఆర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. బాలికలు విద్యార్థి దశలో వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు నాటడంతో అమూల్యమైన ప్రకృతి అంటే తెలుస్తుందన్నారు. పురుగు మందులు లేని ఆహారం తీసుకునేందుకు మొక్కల పెంపకం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మొక్కల పెంపకంపై అవగాహన పెంపొందాలి'


