హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా: ఎస్పీ

సత్యసాయి: ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఆదివారం ప్రారంభం కానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.