అనకాపల్లి జిల్లా సబ్బవరం సమీపంలోని అరిఫాక—యాతపాలెం కొండపై వెలసిన శ్రీ భువనేశ్వరి మాత ఆలయం రేపు ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనమివ్వనుంది. అనంతరం 41 రోజుల పాటు ఆలయం మూసివేసి తిరిగి ప్రత్యేక దర్శనానికి తెరుస్తారు. జిల్లేడు పత్రి అధివాస మహోత్సవం, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. జిల్లేడు ఆకులపై కోరికలు రాసి సమర్పించడం ఇక్కడి సాంప్రదాయంగా పాటిస్తారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఒక్కరోజే శ్రీ భువనేశ్వరి మాత దర్శనం


