ELR: ఆగిరిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శనివారం శ్రీ ధర్మశాస్త అయ్యప్ప, విఘ్నేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ధ్వజస్తంభాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కలశస్థాపన, ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు దేవ గణేష్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ


