హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మోపిదేవిలో 7 నామినేషన్ కేంద్రాలు'

కృష్ణా: మోపిదేవి మండలంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం 7 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి జంగం స్వర్ణ భారతి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. కే.కొత్తపాలెం, పెదప్రోలు, కోసూరు వారిపాలెం, మోపిదేవి, ఉత్తర చిరువోలులంక, వెంకటాపురం, పెదకళ్లేపల్లిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.