W.G: ఉండి మండలం వాండ్రం మెయిన్ స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల చేత కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరాజు, డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. నెహ్రూ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్
వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేత


