హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రసాదాన్ని పోస్టులో పంపించుకోవచ్చు!

శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తులు నేరుగా తమ ఇంటికి పంపించుకునేందుకు సన్నిధానంలో 24 గంటల పాటు నిరంతరం పనిచేసే ప్రత్యేక బుకింగ్ కౌంటర్‌ను భారత తపాలా శాఖ ఏర్పాటు చేయనుంది. మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.