హైదరాబాద్: 28°C
వార్తలు

US కమిషన్‌పై భారత రాయబారి ఫైర్‌

భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితి దిగజారుతోందంటూ USCIRF వెలువరించిన నివేదికను, షార్జీల్ ఇమామ్ ఉదంతాన్ని అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా తీవ్రంగా ఖండించారు. భారత పౌరుల రాజ్యాంగ హక్కులపై మాట్లాడేందుకు, తీర్పులు చెప్పేందుకు ఆ కమిషన్‌కు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేశారు. ఇకనైనా పక్షపాత ధోరణి వీడి ఉచిత సలహాలు ఇవ్వడం పూర్తిగా మానుకోవాలని ఆయన హితవు పలికారు.