హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా స్టార్టప్‌లకు రూ.20 లక్షల వరకు గ్రాంట్లు: మంత్రి

AP: డ్వాక్రా వ్యవస్థ చంద్రబాబు మానసపుత్రిక అని మంత్రి సంధ్యారాణి అన్నారు. మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాలు బలమైన పునాదిగా నిలుస్తున్నాయన్నారు. శ్రీసిటీలో 72వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందన్నారు. నక్కపల్లి టాయ్ పార్క్ ద్వారా 30వేల మంది మహిళలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లకు రూ.20లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నట్లు చెప్పారు.