హైదరాబాద్: 28°C
వార్తలు

USCIRFకు భారత రాయబారి స్ట్రాంగ్ కౌంటర్

జైలులో ఉన్న షార్జీల్ ఇమామ్‌పై అమెరికాకు చెందిన USCIRF చేసిన వ్యాఖ్యలను అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా తీవ్రంగా ఖండించారు. భారత పౌరుల హక్కులపై మాట్లాడేందుకు ఆ కమిషన్‌కు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేశారు. ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం, నీతులు చెప్పడం USCIRF మానుకోవాలని ఆయన హితవు పలికారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం తగదని గట్టి కౌంటర్ ఇచ్చారు.