హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ సీఎం పాక్ పర్యటనకు అనుమతి వస్తుందా?

పాక్ లాహోర్‌లో జరిగే అంతర్జాతీయ పంజాబీ సదస్సులో పాల్గొనేందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. విదేశీ పర్యటనలకు సంబంధించి రాజకీయ అనుమతులు జాతీయ విధానం ప్రకారమే ఉంటాయని పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ విషయంలో భారత్ వైఖరి ఏమిటో అందరికీ తెలుసని చెప్పింది. దీంతో సీఎంకు అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.