హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

CTR: పూతలపట్టు పట్టణంలోని గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఎంతో ఘనంగా మొదలయ్యాయి. చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గురవారెడ్డి జవహర్లాల్ నెహ్రూ ఫొటోకు పూలదండ వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి చదవాలని, కనీసం అరగంట పాటు పుస్తక పఠనం చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.