NLR: కోవూరు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో చెంచులక్ష్మి విచ్చేశారు. విద్యార్థులు గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాలను చదవాలని తెలియజేశారు. పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానం లభిస్తుందన్నారు. గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోవూరులో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


