హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి'

E.G: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన మోరంపూడి రోడ్డు (4, 5, 6), ప్రకాష్ నగర్ (43, 44, 45) వార్డులతో పాటు నగరపాలక కార్యాలయంలోని మేయర్ నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. పత్రాల స్వీకరణ, భద్రపరిచే విధానం, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.