హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలలకు ఉచిత న్యాయసాయం: శ్రీలక్ష్మి

ELR: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శనివారపుపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. పోక్సో చట్టం, సురక్షిత స్పర్శపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఉచిత న్యాయసేవలు పొందేందుకు 15100 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.