NTR: తిరువూరు రాజీవ్ భవన్‌లో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. నవభారత నిర్మాణంలో నెహ్రూ దార్శనికత, స్వాతంత్ర్యం అనంతరం దేశాభివృద్ధికి ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయమని పలువురు నాయకులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
నవభారత నిర్మాత నెహ్రూకు తిరువూరులో నివాళ్లు


