సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 21 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ముంబై 13.1 ఓవర్లలోనే ఛేదించింది.
క్రీడలు
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం


