NTR: మైలవరం ప్రధాన కూడలిలో శనివారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సై-2 గిరి సాయి వాహనదారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మైలవరంలో పోలీసుల వాహన తనిఖీలు


