హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల ముందడుగు

HYD: బాలల దినోత్సవం సందర్భంగా మియాపూర్‌లోని ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా విద్యార్థులు ఉసిరి, బిల్వ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ, పాఠశాల చైర్మన్ మేఘన ముసునూరి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.