హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవిత విద్యా కేంద్రంలో చిల్డ్రన్స్ డే

NLG: చిట్యాలలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా కేంద్రం (భవిత)లో బాలల దినోత్సవ వేడుకలను ఇవాళ నిర్వహించారు. ఈ వేడుకలకు చిన్నారుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షకురాలు ఆవుల గీత చిన్నారుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వారిని సంతోషపరిచారు. కేంద్రంలో పిల్లల మానసిక, శారీరక వికాసానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.