కోనసీమ: ఆలమూరు మండలంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సై జి. నరేష్ శనివారం పలు గ్రామాల్లో పర్యటించారు. ఆలమూరు, పెదపళ్ల, పినపళ్ల, సంధిపూడి, చింతలూరు, సూర్యారావుపేట గ్రామాల్లో నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు, కేంద్రాల అనుకూలతను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై


