హైదరాబాద్: 28°C
క్రీడలు

జపాన్ మాస్టర్స్: సెమీస్‌లో లక్ష్యసేన్‌

జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో లక్ష్యసేన్ 21-16, 21-15తో జపాన్ ప్లేయర్ యుషి తనక‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. సెమీస్‌లో ఆరో సీడ్ ఆల్వి ఫర్హాన్‌తో తలపడుతాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్ 22-24, 15-21 తేడాతో జపాన్ ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు.