హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైర్డాట్వలో బాల గ్రామ సభ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ఖైర్డాట్వలో గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం బాల గ్రామసభను నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్బంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కనక సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులు శ్రద్ధతో తమ ఉన్నత లక్ష్యాలను సాధించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.