హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ బరిలో బీఎస్పీ అభ్యర్థి

BPT: బాపట్ల మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. బహుజన సమాజ్ పార్టీ తరఫున మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జంగం దాసు నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.